నాలుగేళ్లలో ట్రంప్ ఎన్ని తప్పుడు ప్రకటనలు చేశారో తెలుసా..?

Trumps false and misleading claims. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవిని చేతబట్టిన సమయం నుండి పదవిని వీడే వరకూ ఎన్నో అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు చేసుకుంటూ వెళ్లారు.

By Medi Samrat  Published on  25 Jan 2021 1:32 PM GMT
Trumps false and misleading claims

డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవిని చేతబట్టిన సమయం నుండి పదవిని వీడే వరకూ ఎన్నో అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు చేసుకుంటూ వెళ్లారు. నాలుగు సంవత్సరాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నో అబద్ధాలు చెప్పారని.. అక్కడి మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి. అయితే ట్రంప్ చెప్పిన అబద్ధాల సంఖ్యను కూడా లెక్కబెట్టాయి.

నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్, పదవి దిగిపోయే సమయానికి 30,573 అబద్ధాలు చెప్పారట. ఆయన రోజుకు సగటున 21 తప్పుడు క్లయిమ్స్ చేశారని, వాటితో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారని 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పత్రిక ఫ్యాక్ట్ చెక్కర్ టీమ్, ఆయన అన్ని ప్రకటనలనూ విశ్లేషించి ఈ విషయాన్ని పేర్కొంది. బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి 100 రోజుల్లోనే ట్రంప్, 492 అనుమానిత ప్రకటనలు చేశారని, గత సంవత్సరం జరిగిన ఎన్నికల రోజున అంటే నవంబర్ 2న ఏకంగా 503 తప్పుదారి పట్టించే ప్రకటనలను చేశారని గుర్తించింది.

తొలి ఏడాది వ్యవధిలో రోజుకు ఆరు తప్పుడు ప్రకటనలు చేసిన ట్రంప్, క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ.. రెండో సంవత్సరంలో 16, మూడవ సంవత్సరంలో 22, నాలుగో సంవత్సరంలో రోజుకు 39 సార్లు అబద్ధాలు చెప్పారు. తొలి 27 నెలల కాలంలో 10 వేల అబద్ధపు క్లయిములు చేసిన ఆయన, ఆపై 14 నెలల వ్యవధిలోనే 20 వేల తప్పుడు ప్రకటనలు, దాని తరువాత ఐదు నెలల్లోనే ఆ సంఖ్యను 30 వేలకు చేర్చుకున్నారట..! వామ్మో ట్రంప్ ఇన్ని తప్పుడు ప్రకటనలు చేశారా..? అని అందరూ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు.


Next Story