ట్రంప్ మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చాడట..

Trump Was Sicker Than Acknowledged With Covid-19. కరోనా మహమ్మారి సోకిన వ్యక్తుల్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్

By Medi Samrat
Published on : 12 Feb 2021 6:22 PM IST

Trump Was Sicker Than Acknowledged With Covid-19
కరోనా మహమ్మారి సోకిన వ్యక్తుల్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకడు. ఆయన చాలా తొందరగానే కోలుకున్నట్లు అనిపించినా.. మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చాడని తాజాగా వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో గత ఏడాది అక్టోబర్ లో వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ కు ట్రంప్ ను తరలించారని చెప్పారు. ఊపిరి తీసుకోలేకపోయారని, బయటి నుంచి ఆక్సిజన్ అందించాల్సి వచ్చిందని వివరించారు. ఒకానొక టైంలో ఆయన్ను వెంటిలేటర్ మీద పెట్టాలన్న నిర్ణయానికీ వచ్చినట్టు చెబుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకూ ఇన్ ఫెక్షన్ పాకిందని.. బ్యాక్టీరియా, కొన్ని రకాల ద్రవాలతో ఊపిరితిత్తులు వాచాయి.. దీని వల్ల ట్రంప్ ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు 80ల్లోకి పడిపోయాయని వైద్యులు తెలిపారు.


ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శాన్ కోన్లీ మాత్రం చికిత్స సమయంలో ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఆయనకు ఆక్సిజన్ పెట్టలేదని, మామూలుగానే ఉన్నారని మీడియాకు చెప్పారు. బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ ఆశిష్ ఝా స్పందిస్తూ, కోన్లీ తీరుపై మండిపడ్డారు. కోన్లీ నిజాలు చెప్పడంలో విఫలమయ్యారని.. ఆ సమయంలో కోన్లీ మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. తప్పించుకునేందుకు చూశారని.. కోన్లీ గానీ, శ్వేత సౌధ ప్రతినిధులు గానీ నిజాయతీగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అన్నారు. కరోనా సోకిన సమయంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చారు.

ట్రంప్ బాగానే ఉన్నాడు అనే ప్రచారం చేయడం వెనుక ఏదో దురుద్దేశ్యం ఉండే ఉంటుందని పలువురు అమెరికన్ రాజకీయ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఎప్పుడు తలక్రిందులు అవుతుందో అసలు ఊహించలేమని కూడా చెప్పారు. ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్లు అమెరికన్ ప్రజలను మోసం చేశారని.. ఆ సమయంలో ఆయనకు ఏమైనా జరగరానిది జరిగి ఉండి ఉంటే అమెరికా పరిస్థితుల్లో చాలా మార్పులే వచ్చేవని అన్నారు.




Next Story