ట్రంప్ మరో పిడుగు..కలప, ఫర్నిచర్‌పై 25 శాతం సుంకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు.

By -  Knakam Karthik
Published on : 1 Oct 2025 7:41 AM IST

International News, US President, Donald Trump, Tariffs

ట్రంప్ మరో పిడుగు..కలప, ఫర్నిచర్‌పై 25 శాతం సుంకం

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు. ఈ ప్రకటనతో ఫర్నిచర్, కలపపై భారీ సుంకాలు విధించబడ్డాయి. ఇటీవల కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ పరికరాలు, అపెూల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కలపపై 10 శాతం, కిచెన్ క్యాబినెట్లు, అప్ హెూల్స్టర్డ్ ఫర్నిచర్పై 25 శాతం సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి.

చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా అమెరికాలో ఫర్నిచర్ వ్యాపార కేంద్రంగా ఉన్న నార్త్ కరోలినా ప్రాభవాన్ని కోల్పోయిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఫర్నిచర్ తయారీని కొనసాగించకపోతే ఆయన భారీస్థాయిలో సుంకాలను విధిస్తానని ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు.

అదేవిధంగా, సినిమాలపై కూడా భారీ సుంకాలను ప్రకటించారు. యూఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ ప్రకటించడం భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Next Story