యుద్ధంలోకి అమెరికా?.. వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలన్న ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
By అంజి
యుద్ధంలోకి అమెరికా?.. వెంటనే టెహ్రాన్ ఖాళీ చేయాలన్న ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 'ఇరాన్ డీల్ మీద సంతకం చేసుండాల్సింది. వారిని నేను సంతకం చేయమని చెప్పాను. ఎంత సిగ్గుచేటు, ఎంతమంది ప్రాణాలను తీస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను దక్కించుకోలేదని చాలా క్లియర్‌గా పదే పదే చెప్పాను. టెహ్రాన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేయండి' అని ట్రూత్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనతో అమెరికా కూడా యుద్ధంలో చేరనున్నట్టు తెలుస్తోంది. పదు సంఖ్యలో యూఎస్ యుద్ధ విమానాలు మిడిల్ ఈస్ట్ వైపుగా వచ్చాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇజ్రాయెల్‌కు యూఎస్ మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది.
'మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ సమ్మిట్ నుండి ఒక రోజు ముందుగానే బయలుదేరుతున్నారని వైట్ హౌస్ సోమవారం ప్రకటించింది. "స్పష్టమైన కారణాల వల్ల నేను త్వరగా తిరిగి రావాలి" అని ఆయన విలేకరులతో అన్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ దీనిని ఎక్స్‌లో ధృవీకరించారు. మధ్యప్రాచ్యంలో పరిణామాల కారణంగా, అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రి దేశాధినేతలతో విందు తర్వాత బయలుదేరుతారు అని తెలిపారు.
అటు ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు అదనపు ఫోర్సెస్‌ను పంపినట్టు తాజాగా యూఎస్ తెలిపింది. కెనడాలో జీ7 సదస్సులో ఉన్న ట్రంప్ అత్యవసరంగా యూఎస్‌కు బయలుదేరనున్నారు.
అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌తో అణు ఒప్పందాన్ని కోరుతూనే ఉన్నారని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ సోమవారం ఫాక్స్ న్యూస్‌తో అన్నారు. అమెరికా ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు చేయడం లేదని వైట్ హౌస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
అటు మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణను సాధించాలనే లక్ష్యంతో ట్రంప్ నిష్క్రమణ సానుకూలంగా ఉందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేశారని సోమవారం మాక్రాన్ అన్నారు.