US: కోర్టు తీర్పు నాకే ప్లస్..మరోసారి ట్రంప్ రివర్స్ అటాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య సుంకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 7:40 PM IST

International News, Donald Trump, US SupremeCourt, Trade Tariffs, Truth Social, Global Politics, Trump Vs Court

US: కోర్టు తీర్పు నాకే ప్లస్..మరోసారి ట్రంప్ రివర్స్ అటాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య సుంకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సుంకాలను పరిమితం చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును "తెలివితక్కువది, హాస్యాస్పదమైనది" అని ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా విభజన తెచ్చేలా ఉందని తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

అయితే, ఈ తీర్పు తన అధికారాలను తగ్గించలేదని, బదులుగా తనకు మరిన్ని శక్తులు ఇచ్చిందని ట్రంప్ వింత వాదన చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలపై లైసెన్సుల ద్వారా మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఇప్పుడు తనకు కలిగిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల తనకు పరోక్షంగా లాభం చేకూరిందని ఆయన చెప్పుకొచ్చారు.

Next Story