'వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌'పై ట్రంప్‌ సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 4న ఆమోదించబడిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు"పై సంతకం చేశారు. దీంతో ఈ కొత్త ట్యాక్స్‌ బిల్‌ చట్ట రూపం దాల్చింది.

By అంజి
Published on : 5 July 2025 6:52 AM IST

Trump, One Big Beautiful Bill, law , White House, international news

'వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌'పై ట్రంప్‌ సంతకం 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 4న ఆమోదించబడిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు"పై సంతకం చేశారు. దీంతో ఈ కొత్త ట్యాక్స్‌ బిల్‌ చట్ట రూపం దాల్చింది. శుక్రవారం వైట్ హౌస్‌లో ఇండిపెండెన్స్‌ డే వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు" అనే భారీ పన్ను, ఖర్చు కోతల ప్యాకేజీ పేపర్‌పై సంతకం చేశారు. రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభలో ఆమోదించబడిన బిల్లుకు ఒక రోజు తర్వాత ఇది ఒక ప్రధాన శాసనసభ విజయాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రసంగిస్తూ.. దేశంలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉండటం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. అన్ని వర్గాలకు రక్షణ లభించనుందని వ్యాఖ్యానించారు.

ట్యాక్స్‌ కట్స్‌, వ్యయ నియంత్రణ కోసం ఈ బిల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ద్వారా బిల్లును ముందుకు తీసుకెళ్లినందుకు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్ మెజారిటీ నాయకుడు జాన్ థూన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 4న జరిగిన ఉత్సవ వేడుకల సందర్భంగా సౌత్ లాన్‌లో ఈ సంతకం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారులు, కాంగ్రెస్ మిత్రులు, సైనిక కుటుంబాలు, వైట్ హౌస్ సిబ్బందితో సహా వందలాది మంది హాజరయ్యారు. ట్రంప్ రెండవ టర్మ్ ఎజెండాకు మూలస్తంభంగా పరిగణించబడే ఈ చట్టం, హౌస్ ఫ్లోర్‌లో వేడి చర్చ తర్వాత 218-214 తేడాతో స్వల్ప ఆధిక్యంతో ఆమోదించబడింది.

Next Story