అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, క్యూబా దేశాల పట్ల తన పరిపాలన అనుసరించబోయే కఠిన వైఖరిని ఆయన స్పష్టం చేశారు. ముందుగా ఇరాన్ వ్యవహారాన్ని ముగించాలనుకుంటున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా తొలగించడమే తమ ప్రస్తుత లక్ష్యమని సూచించారు. ఇరాన్ తర్వాత తమ దృష్టి క్యూబాపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. "క్యూబా తదుపరి జాబితాలో ఉంది, అది కేవలం సమయానికి సంబంధించిన ప్రశ్న మాత్రమే అని ఆయన అన్నారు.
ఆయా దేశాల్లోని ప్రభుత్వాల తీరు, అమెరికా భద్రతకు అవి కలిగిస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అమెరికా చెబుతోంది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను తానే స్వయంగా ఆమోదించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త అధినేతగా నియమించడాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఇరాన్‌కు శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి కావాలి. ఖమేనీ విధానాలనే కొనసాగించే వ్యక్తి వస్తే, మరో ఐదేళ్లలో మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు ట్రంప్.