గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ట్రంప్

అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

By Knakam Karthik
Published on : 4 April 2025 11:15 AM IST

International News, Donald Trump, Trump Unveils Gold card Visa

గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ట్రంప్

అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు ఇటీవల 'గోల్డ్ కార్డు' ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆయన విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు. ఈ కార్డుపై ట్రంప్ ముఖచిత్రం ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్డ్ పై 'ట్రంప్ కార్డ్' అని రాసి ఉంది. ట్రంప్ సంతకం కూడా కార్డుపై ఉంది.

ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీన్ని తానే మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అయితే, రెండోది ఎవరు కొంటారనేది తెలియదన్నారు. ఈ గోల్డ్ కార్డ్ రెండు వారాల్లో అమ్ముడయిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి రూ.43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించేవారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు.

Next Story