భారత సంతతి మ‌హిళ‌కు పెద్ద బాధ్యత అప్ప‌గించిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ బృందంలో మ‌రో హిందూ నాయ‌కురాలు చేరారు. అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను ట్రంప్ నియమించారు.

By Medi Samrat  Published on  14 Nov 2024 3:03 AM GMT
భారత సంతతి మ‌హిళ‌కు పెద్ద బాధ్యత అప్ప‌గించిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ బృందంలో మ‌రో హిందూ నాయ‌కురాలు చేరారు. అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ అమెరికా తొలి హిందూ కాంగ్రెస్ మహిళగా కూడా గుర్తింపు పొందారు.

తులసి గబ్బార్డ్ కూడా సైనికురాలిగా ఉన్నారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో ప‌నిచేశారు. ఆమె కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ వీడి ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు.

2019లో డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్‌లో తులసి గబ్బర్డ్ కమలా హారిస్‌ను ఓడించారు. అయితే, అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఆమె వెనుకబడ్డారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఎన్నికల చర్చలో హారిస్‌ను ఓడించేందుకు ట్రంప్ తులసి సహాయం కూడా కోరారు.

అమెరికాలో జన్మించిన తులసి గబ్బార్డ్ తండ్రి సమోవాన్ యూరోపియన్ సంతతికి చెందినవారు కాగా.. ఆమె తల్లి భారతీయురాలు. హిందూమతం పట్ల తండ్రికున్న‌ ఆసక్తి కారణంగా వారు ఆమెకి తులసి అని పేరు పెట్టారు.

డొనాల్డ్ ట్రంప్ టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్, మిలియనీర్ వ్యవస్థాపకుడు-రాజకీయవేత్త వివేక్ రామస్వామికి కూడా పెద్ద బాధ్యతలు ఇచ్చారు. మస్క్, రామస్వామి ప్రభుత్వ సమర్థత విభాగానికి (DoGE) నాయకత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామి బయోటెక్ రంగంలో నిష్ణాతులు. ప్రభుత్వ అనుభవం లేకపోయినా కార్పోరేట్ రంగంలో అనుభ‌వాన్ని వాడుకోవ‌డంపై దృష్టి సారించారు.

అంతే కాకుండా అమెరికా కొత్త డిఫెన్స్ సెక్రటరీ పేరును కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ హో, రచయిత పీట్ హెగ్‌సేత్‌ను డిఫెన్స్ సెక్రటరీ పదవికి ట్రంప్ ఎంపిక చేశారు. హెగ్‌సేత్‌ కూడా మాజీ సైనికుడు. 44 ఏళ్ల పీట్ హెగ్‌సేత్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లో పోరాడిన‌ సైన్యంలో పనిచేశారు. ట్రంప్ ఆ దేశ కొత్త అటార్నీ జనరల్‌గా ఫ్లోరిడాకు చెందిన మాట్ గేట్జ్‌ను ఎన్నుకున్నారు.

Next Story