ట్రంప్‌కు‌ ఫేస్‌బుక్‌, ట్విటర్ షాక్‌..!

Trump Facebook Twitter Accounts Freezed. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌లైన ట్విట‌ర్‌,పేస్‌బుక్‌లు షాక్ ఇచ్చాయ...

By Medi Samrat  Published on  7 Jan 2021 4:11 AM GMT
Trump Facebook Twitter Accounts Freezed
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌లైన ట్విట‌ర్‌, పేస్‌బుక్‌లు షాక్ ఇచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టినందుకు ట్రంప్ అకౌంట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో బాగంగా ఫేస్‌బుక్.. ట్రంప్‌‌ ‌ఖాతాను 24 గంటలపాటు నిలిపివేయ‌గా.. మరోవైపు ట్విటర్‌ సైతం ట్రంప్‌ చేసిన మూడు ట్వీట్‌లను తొలగించమని కోరుతూ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది.


దేశంలో జ‌రిగిన‌ అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్‌ డీసీలో జ‌రుగుతున్న హింసాత్మక నిరసనల పట్ల వ్యాఖ్యలు చేయడంతో ‌ ట్రంప్‌ ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్‌బుక్‌, ట్విటర్ తెలియజేశాయి. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టడంతో ట్రంప్‌ ఖాతాకు తాత్కాలికంగా చెక్‌ పెట్టినట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది.

అలాగే.. కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ను నియామకాన్ని నిలిపివేయమంటూ.. ట్రంప్‌ మద్దతుదారులు కాంగ్రెస్‌పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశంపై.. 12 గంటలపాటు ట్రంప్‌ ఖాతాను నిలిపివేస్తున్నట్లు ట్విటర్‌ తెలియజేసింది. ఈ అంశాలపై ట్రంప్‌ చేసిన మూడు ట్వీట్‌లను తొలగించవలసిందిగా ట్విటర్‌ సూచించింది. ఒకవేళ ట్రంప్ ట్వీట్‌లను తొలగించకపోతే..‌ ఖాతా నిలిపివేత కొనసాగుతుందని‌ పేర్కొంది.




Next Story