'వెనిజులా అధ్యక్షుడిని నేనే'.. ట్రంప్ సంచలన ప్రకటన
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By - అంజి |
'వెనిజులా అధ్యక్షుడిని నేనే'.. ట్రంప్ సంచలన ప్రకటన
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై పూర్తి ఆధిపత్యం కోసం చూస్తున్న ట్రంప్.. ఏకంగా అధ్యక్షుడిని తానేనంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పోస్టులో 'వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్, జనవరి 2026లో బాధ్యతలు నిర్వర్తించారు' అనే హోదా ఉన్నాయి. ఇది జనవరి 20, 2025న పదవీ బాధ్యతలు స్వీకరించిన యునైటెడ్ స్టేట్స్ యొక్క 45వ , 47వ అధ్యక్షుడిగా అతని హోదాను కూడా కలిగి ఉంది. వెనిజులాను ఉద్ధరిస్తానన్న ట్రంప్.. తాజాగా ఆ దేశానికి యాక్టింగ్ ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నారు.
డ్రగ్స్‌ను బూచిగా చూపించి ఆయిల్ కంపెనీలను గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన కంపెనీలకే చమురు సరఫరా చేయాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తన చెప్పుచేతల్లోనే ఉండాలన్నారు. తాజా ప్రకటనతో ట్రంప్ ఇంకెన్ని ఆంక్షలు విధిస్తారోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, అమెరికా వెనిజులాపై "పెద్ద ఎత్తున" దాడి చేసి, ఆ దేశ నాయకుడు నికోలస్ మదురోను బంధించింది, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌తో పాటు, న్యూయార్క్‌కు తరలించారు, అక్కడ వారిపై నార్కో-టెర్రరిజం కుట్ర ఆరోపణలపై అభియోగాలు మోపారు.