అక్రమ వలసదారులపై అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై సైనిక బలగాలను ఉపయోగించవచ్చని ట్రంప్ అన్నారు. ఈ విషయంపై అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి(National Emergency)ని ప్రకటించనున్నారు. X లో టామ్ ఫిట్టన్ అనే వ్యక్తి పోస్ట్‌ను రీ పోస్ట్ చేయడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
బహిష్కరణకు సహకరించడానికి నిరాకరించిన డెమొక్రాటిక్ నడిచే రాష్ట్రాలు "మా మార్గం నుండి బయటపడాలి" అని ట్రంప్ సరిహద్దు భద్రతా చీఫ్ టామ్ హోమన్ హెచ్చరించారు. తమ పరిపాలనా విభాగం మొదట ఆ 4 లక్షల 25 వేల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని టామ్ హోమన్ చెప్పారు.
హోమన్ తన వ్యక్తిగత సరిహద్దు భద్రతా అనుభవాలను పంచుకున్నాడు.. సరిహద్దు గస్తీ ఏజెంట్లు ఇప్పుడు చట్టవిరుద్ధమైన వలసదారులను ఆపకుండా కేవలం "ట్రావెల్ ఏజెంట్లు"గా వ్యవహరిస్తున్నారని అన్నారు. లక్షలాది మంది అమెరికన్ పౌరులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు.. వారు ఎటువంటి అడ్డంకులు లేకుండా అక్రమ వలసదారులను అమెరికాకు పంపి.. వారికి ఉచిత విమాన టిక్కెట్లు, హోటళ్ళు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారు.