ఇండోనేషియా, మలేషియాల్లో భారీ భూకంపం
Tremors felt in Malaysia as earthquake hits Indonesia.దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన ఇండోనేషియా, మలేషియాలో
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2022 11:00 AM ISTదక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన ఇండోనేషియా, మలేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం పశ్చిమతీరం సమీపంలో ఉదయం 7.09 గంటలకు భూ ప్రకపంనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదు అయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం బుకిటిన్గీకి 66 కిలోమీటర్ల దూరంలో ఉందని.. భూఅంతర్భాగంలో 12.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు చెప్పింది. కాగా.. ఈ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:6.0, Occurred on 25-02-2022, 07:09:29 IST, Lat: 0.17 & Long: 99.92, Depth: 10 Km ,Location: 384km SSW of Kuala Lumpur, Malaysia for more information Download the BhooKamp App https://t.co/L71Lbw1Lq1@Indiametdept @ndmaindia pic.twitter.com/VwOZyByhd4
— National Center for Seismology (@NCS_Earthquake) February 25, 2022
ఇక మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కౌలాలంపూర్‌కు 384 కిలోమీటర్ల దూరంలో ఉందని.. అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది.