ఆస్ట్రేలియా దేశంలోని ఓ పాఠశాల వార్షికోత్సవ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. బలమైన గాలులు జంపింగ్ క్యాస్టల్‌ను ఒక్కసారిగా పైకి లేపడంతో నలుగురు పిల్లలు మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అందులో ఆడుతున్న పిల్లలు 33 అడుగుల మీద నుండి పడిపోయారని అధికారులు గురువారం తెలిపారు. టాస్మానియా రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో డెవాన్‌పోర్ట్‌లో ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది. కాగా జరిగిన ప్రమాదంలో ప్రాథమిక పాఠశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు మరణించారు. మరో ఐదుగురు చిన్నారులు ఆసుపత్రిలో ఉన్నారని, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. జంపింగ్ క్యాస్టల్ ఒక్కసారిగా గాలిలో ఎలా ఎగిరిందనే దానిపై తక్షణ వివరణ లేదు. హిల్‌క్రెస్ట్ ప్రైమరీ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాల చివరి సంవత్సరం, 6వ సంవత్సరం విద్యార్థులు సాధారణంగా 10 లేదా 11 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటారు.
ఈ ప్రమాదం ఆస్ట్రేలియాలో వినోదభరితమైన రైడ్‌తో కూడిన అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. " మృతి చెందిన పిల్లలు తమ ప్రాథమిక పాఠశాల చివరి రోజును జరుపుకోవడానికి ఉద్దేశించిన ఒక రోజు, బదులుగా మేము వారి నష్టానికి దుఃఖిస్తున్నాము" అని టాస్మానియా పోలీసు కమిషనర్ డారెన్ హైన్ విలేకరులతో అన్నారు. టాస్మానియన్ ప్రీమియర్ పీటర్ గుట్వీన్ మాట్లాడుతూ "ఈ దిగ్భ్రాంతికరమైన విషాదం సంభవించడం ఊహించలేమని" అన్నారు. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ఈ సంఘటనను "హృదయ విదారక ఘటనగా" అభివర్ణించారు. చిన్న పిల్లలు వారి కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. ఇది సంవత్సరం చివరి సమయంలో ఇటువంటి భయంకరమైన విషాదానికి దారి తీసింది. ఇది హృదయానికి బాధ కలిగిస్తుంది" అని మోరిసన్ విలేకరులతో అన్నారు.