ఆ దేశంలో టిక్ టాక్ పై కేసు వేసిన 12 ఏళ్ల బాలిక!

Tiktok Face Legal Action England 12Year Old Girl. టిక్ టాక్ ఈ పేరు వింటేనే ఎంతోమంది తెగ ఆనంద పడుతుంటారు. ఈ టిక్ టాక్ యాప్ పై కేసు వేసిన 12 ఏళ్ల ఇంగ్లాండ్ బాలిక .

By Medi Samrat  Published on  1 Jan 2021 11:08 AM GMT
Tiktok Face Legal Action

టిక్ టాక్ ఈ పేరు వింటేనే ఎంతోమంది తెగ ఆనంద పడుతుంటారు. ఈ టిక్ టాక్ యాప్ ద్వారా తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అయితే కొన్ని భద్రతా చర్యల కారణంగా భారతదేశంలో ఈ యాప్ ను తొలగించినట్లు మనకు తెలిసిందే. అయితే 2020 సంవత్సరంలో చైనా కంపెనీలకు సంబంధించిన కొన్ని యాప్ లను నిషేధించడంతో ఆ సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. వీటిలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న టిక్ టాక్,పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్‌కు ఈ 2020 సంవత్సరంలో చాలా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.

కేవలం ఈ యాప్ ను భారతదేశంలో తొలగించడమే కాకుండా, తాజాగా బ్రిటన్ లో పన్నెండేళ్ల బాలిక టిక్ టాక్ పై కేసు నమోదు చేయడం గమనార్హం. వ్యక్తిగత గోప్యత విషయంలో ఐరోపా సమాఖ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆ బాలిక తన విషయాలను రహస్యంగా ఉంచుతూ కేసు ఫైల్ చేయడానికి స్థానిక కోర్టు అనుమతి తెలిపింది. ఈ టిక్ టాక్ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇంగ్లాండ్ పిల్లల కమిషనర్ అన్నే లాంగ్ఫీల్డ్ మద్దతు తెలిపారు.

ఎంఎస్ లాంగ్‌ఫీల్డ్ మాట్లాడుతూ 16 ఏళ్ళ లోపు పిల్లలకు ఈ కేసు మరింత రక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు. అయితే డేటా రక్షణ లోపం కారణంగా తన వ్యక్తిగత విషయాలు బహిర్గతమయ్యాయనే ఉద్దేశంతో ఆ బాలిక ఈ యాప్ పై కేసు వేసినట్లు తెలిపారు. తన వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ కేసుపై తదుపరి విచారణకు ఆదేశించింది. అయితే ఇలాంటి డేటా రక్షణకు సంబంధించిన కేసులను ఎదుర్కోవడం టిక్ టాక్ కి ఇది మొదటిసారి కాదని, ఇంతకుముందే ఇలాంటి కేసులో భాగంగా 2019లో టిక్‌టాక్‌కు US ఫెడరల్ ట్రేడ్ కమిషన్ $ 5.7 మిలియన్ జరిమానా కూడా విధించిందని చెప్పవచ్చు.
Next Story