అమెరికన్ బిలియనీర్ ఫైనాన్షియర్ థామస్ హెచ్. లీ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు, పరపతి కొనుగోలులలో ఎంతో మందికి మార్గదర్శకుడిగా పరిగణించబడిన థామస్ 78 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అతని కుటుంబం తెలిపింది. న్యూయార్క్ సిటీ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం శుక్రవారం ఆయన మరణానికి కారణం తెలిపింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని.. తన తలపై తానే కాల్చుకున్న తుపాకీ గాయం ఉందని అధికారులు తెలిపారు. లీ గురువారం ఉదయం అతని ఫిఫ్త్ అవెన్యూ మాన్‌హట్టన్ ప్రధాన కార్యాలయంలో మరణించినట్లు కనుగొన్నారు. పోలీసులకు ఉదయం 11:10 గంటలకు (1610 GMT) అత్యవసర-911 కాల్‌కు సమాచారం వచ్చింది.
లీ 2006లో స్థాపించిన లీ ఈక్విటీకి వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో థామస్ హెచ్. లీ పార్టనర్స్‌కు ఛైర్మన్, CEOగా పనిచేశారు. దీనిని 1974లో స్థాపించాడు. గత 46 సంవత్సరాల్లో, స్నాప్‌పుల్ బెవరేజెస్, వార్నర్ మ్యూజిక్ వంటి బ్రాండ్లను కొనుగోలు చేయడం, అమ్మకాలు సహా వందలాది లావాదేవీలలో $15 బిలియన్ల కంటే ఎక్కువ మూలధనాన్ని పెట్టుబడి పెట్టడంలో లీ ముందున్నారు. లింకన్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, బ్రాండీస్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మ్యూజియం ఆఫ్ జ్యూయిష్ హెరిటేజ్‌తో సహా అనేక సంస్థల బోర్డులలో ట్రస్టీగా కూడా సేవలు అందించారు.