ఆ సినిమాను భారత్ లో రిలీజ్ చేయడం లేదు

The Legend of Maula Jatt. భారతదేశంలో విడుదలకు సిద్ధమైన పాకిస్తాన్ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' ను విడుదల చేయనివ్వలేదు

By M.S.R  Published on  30 Dec 2022 9:54 AM GMT
ఆ సినిమాను భారత్ లో రిలీజ్ చేయడం లేదు

భారతదేశంలో విడుదలకు సిద్ధమైన పాకిస్తాన్ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్' ను విడుదల చేయనివ్వలేదు. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటించిన పాకిస్థానీ బ్లాక్‌బస్టర్ 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' ను భారత్ లో విడుదల చేయనివ్వడం లేదని తెలిపారు. శుక్రవారం విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడిందని.. ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేమని INOX అధికారి తెలిపారు. ఈ సినిమా విడుదలను పలువురు తప్పుబట్టారు. "సినిమా విడుదల వాయిదా పడిందని డిస్ట్రిబ్యూటర్లు మాకు సమాచారం అందించారు. ఈ విషయం మాకు రెండు-మూడు రోజుల క్రితమే చెప్పాం. తదుపరి విడుదల తేదీని మాతో పంచుకోలేదు" అని మల్టీప్లెక్స్ చైన్‌కు చెందిన ఒక అధికారి పిటిఐకి తెలిపారు.

బిలాల్ లాషారి దర్శకత్వం వహించిన "ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్".. 1979 కల్ట్ క్లాసిక్ "మౌలా జట్"కి కంటిన్యూగా వచ్చిన సినిమా అని చెబుతున్నారు. అయితే ఇది రీమేక్‌ కాదని.. అలాగని సీక్వెల్‌ కూడా కాదని నిర్మాతలు చెబుతున్నారు. అక్టోబర్ 13న పాకిస్థాన్‌లో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన పాకిస్థానీ చిత్రంగా నిలిచింది. మహిరా, ఫవాద్ భారత ఆడియన్స్ కు బాగా పరిచయమైన వ్యక్తులు. పాకిస్తానీ డ్రామా "హమ్‌సఫర్" ద్వారా భారతీయ ప్రేక్షకులకు సుపరిచితులు. ఫవాద్, "ఖూబ్‌సూరత్" "కపూర్ & సన్స్" సినిమాల్లో కనిపించారు. షారుఖ్ ఖాన్ నటించిన "రయీస్"లో మహిరా ఖాన్ కనిపించింది. మల్టీప్లెక్స్ చైన్ PVR సినిమాస్ ఈ వారం ప్రారంభంలో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ చిత్రం భారతదేశంలో విడుదల తేదీని పంచుకుంది. అయితే వెంటనే దానిని తొలగించింది. పంజాబీ మాట్లాడే ప్రజలు ఉన్న ఢిల్లీలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ వీలు పడలేదు. 2011లో మహిరా నటించిన "బోల్" భారతదేశంలో థియేటర్లలో విడుదలైన చివరి పాకిస్థానీ చిత్రం. అంతకు ముందు 2008లో నందితా దాస్, రషీద్ ఫారూఖీ నటించిన "రాంచంద్ పాకిస్తానీ" కూడా విడుదలైంది.


Next Story