టెస్లాలో కొత్తగా చేరిన ఉద్యోగి.. వ్యాపార రహస్యాలను బయటకు చేరవేశారా..?

Tesla sues ex-employee for allegedly stealing trade secrets. ప్రముఖ ఎలెక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా కంపెనీకి చెందిన అతి ముఖ్యమైన 26000 డాక్యుమెంట్లను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇతరులకు చేరవేశారని సంస్థ కోర్టుకు ఎక్కింది.

By Medi Samrat  Published on  25 Jan 2021 7:10 PM IST
Tesla sues ex-employee for allegedly stealing trade secrets

ప్రముఖ ఎలెక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా కంపెనీకి చెందిన అతి ముఖ్యమైన 26000 డాక్యుమెంట్లను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇతరులకు చేరవేశారని సంస్థ కోర్టుకు ఎక్కింది. ఈ ఫైల్స్ లో ఎన్నో ముఖ్యమైన డాక్యుమెంట్లు, కంపెనీకి చెందిన ట్రేడ్ సీక్రెట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన పర్సనల్ డ్రాప్ బాక్స్ నుండి ఈ ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ సాఫ్ట్ వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజినీర్ అలెక్స్ ఖైల్తోవ్ డిసెంబర్ 28, 2020న టెస్లాలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే అతడు టెస్లా కంపెనీకి సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్లను ట్రాన్స్ఫర్ చేసేశాడట.. ఒక్కో ట్రేడ్ సీక్రెట్ ను డెవెలప్ చేయడానికి టెస్లా కంపెనీకి కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంది. దీంతో టెస్లా కంపెనీ నార్తన్ డిస్ట్రిక్ ఆఫ్ క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ డివిజన్ లో కేసును నమోదు చేసింది.

రోడ్ మ్యాప్ ఫ‌ర్ టెస్లాస్ ఇన్నోవేష‌న్ ప్లాన్‌కు సంబంధించిన 26 వేల కాన్పిడెన్షియ‌ల్ ఫైళ్ల‌ను క్లౌడ్ స్టోరేజీ స‌ర్వీస్ డ్రాప్‌బాక్స్ సొంత ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ అలెక్స్ ఖైల్తోవ్ సంస్థ సెక్యూరిటీ టీంకు ప‌ట్టుబ‌డ్డాడని కోర్టుకు టెస్లా కంపెనీ చెప్పింది.

తాను వ్య‌క్తిగ‌త అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్ల‌ను మాత్ర‌మే ట్రాన్స్‌ఫ‌ర్ చేశాన‌ని చెబుతున్నాడు అలెక్స్ ఖైల్తోవ్. డ్రాప్ బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన ఫైళ్ల ఆధారాల‌ను డిలిట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. పొర‌పాటున త‌న డ్రాప్ బాక్స్‌లోకి సాఫ్ట్‌వేర్ ఫైళ్లు ట్రాన్స్ఫర్ అయ్యాయ‌ని మీడియాకు తెలిపాడు అలెక్స్ ఖైల్తోవ్. అలెక్స్ ఖైల్తోవ్ కు ఇంకా ఎటువంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేద‌ని, 50 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్న టెస్లాలో 40 మందితో అలెక్స్ టీం ప‌ని చేసింద‌ని సంస్థ తెలిపింది. జ‌న‌వ‌రి ఆరో తేదీన వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డాన్ని టెస్లా సెక్యూరిటీ టీం నిర్ధారించింది. ఆ వెంట‌నే వీడియో ఫోన్ కాల్ ద్వారా ప్ర‌శ్నించింద‌ని, ఆ టీంతో మాట్లాడ‌టాన్ని అలెక్స్ ఖైల్తోవ్ ఆల‌స్యం చేశాడ‌ని, త‌న కంప్యూట‌ర్ నుంచి ఫైళ్లు డిలిట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని సెక్యూరిటీ టీం అంటోంది.


Next Story