ప్రభుత్వం ఇప్పట్లో ఏర్పాటవ్వడం కష్టమే..!

Taliban had to postpone government formation. ఆఫ్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబాన్లు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు.

By M.S.R  Published on  5 Sep 2021 11:15 AM GMT
ప్రభుత్వం ఇప్పట్లో ఏర్పాటవ్వడం కష్టమే..!

ఆఫ్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబాన్లు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అయినప్పటికీ కుదరడం లేదు. తాలిబాన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేసినట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ప్రభుత్వాధినేతగా శనివారమే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా.. చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని తాలిబాన్లు తెలిపారు.

ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబాన్‌ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్‌ హక్కానీ చెప్పారు. తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు.


Next Story