కొవిషీల్డ్‌+ఫైజర్ = మూములుగా ఉండ‌దు మ‌రి..!

Taking First Dose of Pfizer and Second Dose of Covishield May Boost Body's Immune Response. బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

By Medi Samrat  Published on  1 July 2021 4:00 AM GMT
కొవిషీల్డ్‌+ఫైజర్ = మూములుగా ఉండ‌దు మ‌రి..!

బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనంలో కీల‌క విష‌యం చెప్పారు. కొవిషీల్డ్‌, ఫైజర్‌ టీకాల మిశ్రమ డోసులు కరోనా నివారణలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని తేల్చారు. ఈ రెండింటిలో ఒక టీకాను తొలి డోసుగా, మరోదాన్ని రెండో డోసుగా స్వీకరించినప్పుడు వ్యక్తులకు బలమైన రోగ నిరోధక సామర్థ్యం చేకూరుతుందని నిర్ధారించారు. 830 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారందరి సగటు వయసు 57.8 ఏళ్లు.

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులను తీసుకున్న వ్యక్తులతో పోలిస్తే.. నాలుగు వారాల వ్యవధిలో ఒక డోసుగా కొవిషీల్డ్‌ను, మరో డోసుగా ఫైజర్‌ను వేసుకున్నవారిలో కొవిడ్‌ కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. రెండు వ్యాక్సిన్లలో దేన్ని తొలి డోసుగా తీసుకున్నా ఫర్వాలేదని స్పష్టం చేశారు. అయితే- మొదట ఫైజర్‌ను, తర్వాత కొవిషీల్డ్‌ను వేసుకున్నవారికంటే.. తొలుత కొవిషీల్డ్‌ను, ఆపై ఫైజర్‌ను తీసుకున్నవారిలో యాంటీబాడీలు, టీ-సెల్‌ స్పందనలు మరింత అధికంగా ఉంటున్నాయని తెలిపారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ త‌యారుచేస్తుండ‌గా.. ఫైజ‌ర్ అమెరికాకు చెందిన ఫైజ‌ర్ పార్మాస్యూటిక‌ల్ సంస్థ త‌యారుచేస్తుంది.





Next Story