కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 19 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్

Suicide attack in Kabul.. 19 killed, 27 injured. అప్ఘానిస్తాన్‌లో ఆత్మహుతి దాడి జరిగింది. కాబూల్‌లోని విద్యా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం

By అంజి  Published on  30 Sep 2022 8:05 AM GMT
కాబూల్‌లో ఆత్మహుతి దాడి.. 19 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్

అప్ఘానిస్తాన్‌లో ఆత్మహుతి దాడి జరిగింది. కాబూల్‌లోని విద్యా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 19 మంది మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సాధారణంగా శుక్రవారం పాఠశాలలు మూసివేయబడతాయి. అయితే విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం ఎడ్యుకేషన్ సెంటర్‌కు వచ్చారు. ఆఫ్ఘన్ రాజధానిలోని షియా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించారని, 27 మంది గాయపడ్డారని కాబూల్ పోలీసు చీఫ్‌కు తాలిబాన్ నియమించిన అధికార ప్రతినిధి తెలిపారు.

"కాజ్" అనే విద్యా కేంద్రంపై దాడి జరిగింది. ఇది దురదృష్టవశాత్తు మరణాలు, గాయాలకు కారణమైంది" అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ ట్వీట్ చేశారు. ''ఈ విద్యా కేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. దురదృష్టవశాత్తు, 19 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు.'' అని కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. ఈ దాడికి ఏ బృందం లేదా వ్యక్తి ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు.

స్థానిక నివాసి ఘుల్మ్ సాదిక్ మాట్లాడుతూ.. '' మేం పెద్ద శబ్దం విన్నప్పుడు ఇంట్లో ఉన్నాం. విద్యా కేంద్రం నుండి పొగలు పైకి లేవడం చూసి ఇరుగుపొరుగు వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నా స్నేహితులు, నేను పేలుడు జరిగిన ప్రదేశం నుండి 15 మంది గాయపడిన వారిని, మృతదేహాలను ఆస్పత్రికి తరలించగలిగాము. ఇతర మృతదేహాలు తరగతి గదిలో కుర్చీలు, టేబుల్‌ల కింద పడి ఉన్నాయి'' అని చెప్పాడు. వారం క్రితం కాబూల్‌లో జరిగిన ఇలాంటి పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గాయపడ్డారు.

Next Story