ది లాన్సెట్ ప్రసూతి, గైనకాలజీ, & ఉమెన్స్ హెల్త్‌లో(Obstetrics, Gynaecology, & Women's Health) ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం, ADHD లేదా మేధో వైకల్యాలు వచ్చే ప్రమాదం పెరగదని తేలింది. సెప్టెంబర్ 2025లో, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారాసెటమాల్ మంచిది కాదని చెప్పడం వివాదానికి కారణమైంది. టైలెనాల్‌లో ప్రధాన పదార్ధం అయిన ఎసిటమినోఫెన్ (పారాసెటమాల్ అని కూడా పిలుస్తారు) తీసుకోవడం విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాబోయే తల్లులకు పిలుపునిచ్చారు. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల పిల్లలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని US పరిపాలన విభాగం సూచించింది. అయితే తాజాగా జరిగిన పరిశోధనలు దీనికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించింది.
ADHD లక్షణాలు బాల్యంలోనే కనిపించడం ప్రారంభమవుతాయి. యుక్తవయస్సు వరకు కొనసాగవచ్చు. చాలా మంది పెద్ద అయ్యే వరకు ఈ పరిస్థితిని నిర్ధారించరు. ADHDకి చికిత్స లేనప్పటికీ, మందులు, పలు చికిత్సలు ఈ పరిస్థితి నుండి కొంచెమైనా బయటకు రావడానికి సహాయపడతాయి.