ఇండోనేషియాలో పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారం ఉదయం 5.17 గంటలకు టొబొటోలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.0గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) వెల్లడించింది. టొబొటోకు 259 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 174.3 కిలోమీటర్ల లోతులో భూ కంపకేంద్రాన్ని గుర్తించారు. ఇక హెల్మహెరాకు ఉత్తరాన కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక్కడ కూడా రిక్టర్ స్కేల్ భూ కంప తీవ్రత 6.0గా నమోదు అయ్యింది. కాగా.. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు చెబుతున్నారు.