శనివారం నాడు ఉదయం మియామి ఎయిర్‌పోర్టులో ఓ విమానం ల్యాండ్ అయ్యింది. అది గ్వాటెమాల నుండి వచ్చింది. విమానంలోని ప్రయాణికులు కిందకు దిగేందుకు సిద్ధంగా ఉండగా.. బయట ఎయిర్‌పోర్టు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు విమానం నుండి బయటకు వచ్చాడు. దీంతో అక్కడున్న సిబ్బంది అతడిని ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అతడు విమానం డోర్ నుండి బయటకు వస్తే సాధారణమే విషయమే. కానీ అతడు ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్ నుండి బయటకు దిగాడు. దాదాపు మియామి ఎయిర్‌పోర్టుకు 1640 కిలోమీటర్ల దూరంలో గల గ్వాటెమాలా నుండి అతడు ప్రయాణం చేశాడు. గ్వాటెమాలా నుండి మియామికి వెళ్లాలంటే అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో రెండున్నర గంటల సమయం పడుతుంది. విమానం
టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఆ వ్యక్తి 1640 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. విమానం నుండి దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలను సిబ్బంది తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం గేర్‌లో దాక్కుని ప్రయాణించిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ వీడియో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. గ్వాటెమాలా దేశం నుండి అమెరికాకు వలస వెళ్లేవారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోయింది.
"విమానం వంటి పరిమిత ప్రదేశాలలో వ్యక్తులు తమను తాము దాచుకోవడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నష్టాలను తీసుకుంటున్నారు" అని సీబీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన విచారణలో ఉంది. "జాక్సన్ మెమోరియల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లబడిన యువకుడు.. గ్వాటెమాల సిటీ నుండి మియామికి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ 1182లో దాదాపు 2 గంటల 50 నిమిషాల పాటు గాలిలో ప్రయాణించాడు, విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాగి ఉన్నాడు" అని మయామి-డేడ్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్రెగ్ చిన్ ది చెప్పారు.