ఓవైపు ఆర్థిక సంక్షోభం.. మ‌రోవైపు అధ్య‌క్షుడి నివాసంలో భారీగా నోట్ల క‌ట్ట‌లు..!

Sri Lankan protesters find millions of rupees from Gotabaya Rajapaksa’s house.శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2022 8:10 AM GMT
ఓవైపు ఆర్థిక సంక్షోభం..  మ‌రోవైపు అధ్య‌క్షుడి నివాసంలో భారీగా నోట్ల క‌ట్ట‌లు..!

శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పై క‌న్నెరజేశారు. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు అధ్య‌క్షుడి నివాసాన్ని ముట్ట‌డించారు. భ‌ద్ర‌తావ‌ల‌యాన్ని దాటుకుని లోప‌లికి వెళ్లారు. అయితే.. ముప్పును ముందే ప‌సిగ‌ట్టిన అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స త‌న నివాసం నుంచి పారిపోయాడు. ఇంత వ‌ర‌కు అధ్య‌క్షుడు ఎక్క‌డ ఉన్నాడు అనే స‌మాచారం మాత్రం తెలియ‌రాలేదు.

ఇదిలా ఉంటే.. అధ్య‌క్షుడి భ‌వ‌నాన్ని ముట్ట‌డించిన నిర‌స‌న కారులు అక్క‌డ ర‌చ్చ ర‌చ్చ చేశారు. స్విమ్మింగ్‌లో ఈత కొట్ట‌డం, వంట‌గ‌ది, ప‌డ‌గ గ‌దిలో క‌లియ‌తిరుగుతున్న వీడియోలో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక అధ్య‌క్షుడి నివాసంలో పెద్ద మొత్తంలో క‌ర్సెనీ ని నిర‌స‌న‌కారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స్థానిక మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.ఇంకా నిర‌స‌న కారులు అధ్య‌క్షుడి భ‌వ‌నంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప‌రిస్థితులు దిగ‌జారిన నేప‌థ్యంలో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క శాఖ మంత్రి హరిన్‌ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి శాఖ మంత్రి మనుష ననయక్కరలు ప్రకటించారు.


Next Story