అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్యాసింజర్స్ విమానాన్ని, సైనిక హెలికాప్టర్ ఢీకొట్టిన ఘటనలో విమానంలోని మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా యూఎస్ఏ లోని వర్జీనియా రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం 64 మందితో ఓ విమాన ల్యాండ్ అవుతోంది. ఈ క్రమంలో ఫ్లైట్ పోటోమాక్ నది సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ ఆ ప్యాసింజర్ ఫ్లైట్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి, విమానం, హెలికాప్టర్ పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఈ మేరకు వాషింగ్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఫైర్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. ఈ ప్రమాదం కారణంగా రీగన్ నేషనల్ పరిధిలోని అన్ని విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే, విమానం కూలిపోవడానికి గల కారణాలేంటనే విషయం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అదే విధంగా రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని విమానాల టేకాఫ్స్ , ల్యాండింగ్స్ ను పూర్తి నిలిపివేశారు. ఎయిర్ ఫీల్డ్ విమానం కూలిన ఘటనపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా ఫ్లైట్ యాక్సిడెంట్‌కు సంబంధించి ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.