సాధారణంగా అల్ వోల్ఫ్ ను ఇళ్ల వద్ద ఒకటి లేదా రెండు పాములను పట్టుకొని వెళ్ళమని పిలిచేవారు. అయితే ఇటీవల ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ మహిళ తన ఇంటి కింద పాములు ఉన్నాయని అల్ వోల్ఫ్ ను పిలిచింది. తీరా అక్కడ చూస్తే ఏకంగా 90 కి పైగా పాములు ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. వోల్ఫ్ సోనామా కౌంటీ సరీసృపాల రెస్క్యూ డైరెక్టర్. శాంటా రోసాలోని పర్వతప్రాంతంలో ఉన్న ఓ ఇంటి కింద ఉన్న పాములను పట్టుకోడానికి రాగా.. ఒక పాము వెంట మరొక పామును బయటకు తీస్తూ చాలానే కష్టపడ్డాడు. దాదాపు 4 గంటలు కష్టపడి అక్కడి నుంచి సుమారు 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటికి తీశారు. అందులో కొన్ని పాము పిల్లలు కూడా ఉన్నాయి. బయట పాములకు తిండి దొరకక.. అన్నీ ఒకేచోట నివాసం ఉంటున్నాయని రెస్క్యూ టీమ్ వెల్లడించింది.
ఆ పాములు దొరికిన చోటుకు దగ్గరగా చనిపోయిన పిల్లి, ఒక పోసమ్‌ను కూడా కనుగొన్నారు. అన్ని పాములు ఉత్తర పసిఫిక్ ర్యాటిల్ స్నేక్స్ అట.. ఉత్తర కాలిఫోర్నియాలో కనిపించే ఏకైక విషసర్పం అని ఆయన చెప్పారు. 32 ఏళ్లుగా పాములను కాపాడిన మరియు 13 సార్లు కాటుకు గురయ్యారు వోల్ఫ్. 17 కౌంటీలలో తాను పాములకు సంబంధించిన ఫోన్ కాల్స్ కు ప్రతిస్పందిస్తున్నానని.. అడవిలో ఒకే చోట డజన్ల కొద్దీ వాటిని చూశానని.. కానీ ఎప్పుడూ ఇంటి కింద ఇన్ని పాములను చూడలేదని అన్నారు.