హిజ్బుల్లా సంస్థకు కొత్త చీఫ్‌ను ఎన్నుకుంది. హసన్ నస్రల్లా మరణం తర్వాత.. సంస్థ కొత్త చీఫ్‌గా నయీమ్ ఖాస్సెమ్ నియమితులయ్యారు. ఖాస్సెమ్ అంతకుముందు హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. ఖాసిమ్‌ను షూరా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు హిజ్బుల్లా ఒక ప్రకటన విడుదల చేసింది.
1991లో నయీం ఖాసిం సంస్థకు డిప్యూటీ చీఫ్‌గా నియమితులయ్యారు. సంస్థ పట్ల ఖాసిం అంకితభావం, అత్యుత్సాహం చూసి ఆయన్ను చీఫ్‌గా నియమించినట్లు హిజ్బుల్లా తెలిపింది. హమాస్ నస్రల్లా మరణం కన్నా ముందే.. నయీమ్ ఖాసింను హిజ్బుల్లాకు నంబర్ టూ నాయకుడిగా పరిగణించేవారు.
సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో హసన్ నస్రల్లాను హతమార్చింది. హసన్ నస్రల్లా హిజ్బుల్లాకు నాయకత్వం వహిస్తున్న సమయంలో ఖాసిం సంస్థ ప్రధాన ప్రతినిధిలలో ఒకరు.