73 సంవత్సరాల తర్వాత మద్యపాన నిషేధం ఎత్తివేత..!

సౌదీ అరేబియాలో మద్యపానం తాగడం, అమ్మడం నిషేధం.

By Medi Samrat
Published on : 26 May 2025 7:15 PM IST

73 సంవత్సరాల తర్వాత మద్యపాన నిషేధం ఎత్తివేత..!

సౌదీ అరేబియాలో మద్యపానం తాగడం, అమ్మడం నిషేధం. అయితే 73 సంవత్సరాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేయనున్నారు. కఠినమైన లైసెన్సింగ్ వ్యవస్థను తీసుకుని వచ్చి 2026 నాటికి మద్యం అమ్మకం, వినియోగంపై ఉన్న 73 సంవత్సరాల నిషేధాన్ని ఎత్తివేయనుంది.

రియాద్ ఎక్స్‌పో 2030, 2034లో జరిగే FIFA ప్రపంచ కప్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి సౌదీ అరేబియా చేస్తున్న సన్నాహకాలలో ఈ మార్పు కీలకం. సౌదీ అరేబియా 1952 నుండి మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తోంది, పౌరులు, విదేశీయులు ఇద్దరూ మద్యపానాన్ని నిషేదించింది. అయితే, జనవరి 2024 నుండి రియాద్‌లోని ఒక దుకాణానికి కఠినమైన నిబంధనల ప్రకారం ముస్లిమేతర దౌత్యవేత్తలకు మద్యం విక్రయించడానికి అనుమతి లభించింది.

సౌదీ మూమెంట్స్ నివేదిక ప్రకారం, కొత్త నియంత్రణ చట్టం ప్రకారం సౌదీ అరేబియా అంతటా సుమారు 600 ప్రదేశాలలో నియంత్రిత మద్యం అమ్మకాలను అనుమతించే అవకాశం ఉంది. వీటిలో ఫైవ్ స్టార్ హోటళ్ళు, లగ్జరీ రిసార్ట్‌లు, ప్రధాన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

Next Story