56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా

భిక్షాటన లేదా భిక్షాటన పేరుతో చేసే వ్యాపారం పాకిస్థాన్‌లో పరిశ్రమలా వర్ధిల్లుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకారం.. పాకిస్తాన్ బిచ్చగాళ్ళు సంవత్సరానికి 42 బిలియన్లు సంపాదిస్తారు.

By -  Medi Samrat
Published on : 19 Dec 2025 2:51 PM IST

56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా

భిక్షాటన లేదా భిక్షాటన పేరుతో చేసే వ్యాపారం పాకిస్థాన్‌లో పరిశ్రమలా వర్ధిల్లుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకారం.. పాకిస్తాన్ బిచ్చగాళ్ళు సంవత్సరానికి 42 బిలియన్లు సంపాదిస్తారు. అక్క‌డి బిచ్చగాళ్ళు సొంత‌ దేశంలో అడుక్కోవ‌డ‌మే కాకుండా.. ఇతర దేశాలకు వెళ్లి అక్క‌డ కూడా యాచ‌క వృత్తిని కొన‌సాగిస్తారు.

పాకిస్తాన్ నుండి పర్యాటకులు, యాత్రికులుగా నటిస్తూ బిచ్చగాళ్ల ముఠాలు సౌదీ అరేబియా, యుఎఇ, ఒమన్ వంటి దేశాలకు చేరుకుంటాయి. ఈ దేశాల్లో యాచించడం చట్టబద్ధంగా నిషేధించబడింది. అయినప్పటికీ పాకిస్తానీ పౌరులు భిక్షాటన చేయడానికి ఇక్కడకు వస్తారు. ఇటీవల సౌదీ అరేబియా భిక్షాటన చేస్తున్నారనే ఆరోపణలపై 56 వేల మంది పాకిస్థానీలను బహిష్కరించింది. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ బిచ్చగాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తారు అనే ప్రశ్న తలెత్తుతుంది.

పాకిస్తానీ వార్తాపత్రిక డాన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యప్రాచ్య దేశాల నుండి పాకిస్థానీ బిచ్చగాళ్ల బహిష్కరణకు సంబంధించిన డేటాను రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ పంచుకున్నారు. ఒక్క సౌదీ అరేబియాలోనే కనీసం 4,700 మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను బహిష్కరించినట్లు ఆసిఫ్ తెలిపారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లో దాదాపు 22 మిలియన్ల మంది యాచకులు ఏటా కనీసం రూ. 42 బిలియన్లు సంపాదిస్తున్నారని.. వీరి సంఖ్య‌ నానాటికీ పెరుగుతూ విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజార్చుతుందని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లో యాచించడం సాంకేతికంగా చట్టవిరుద్ధం. 1958 నాటి చట్టం ఉంది - వాగ్రన్సీ ఆర్డినెన్స్ - దీని ప్రకారం ఎవరైనా బిచ్చగాడు లేదా బలవంతంగా తమ పిల్లలను భిక్షాటన చేయిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సివుంటుంది. ఇప్పటికీ వ్యవస్థీకృతంగానే నిర్వహిస్తున్నా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. దానిని ఆపడానికి అక్కడ ఎటువంటి యంత్రాంగమూ లేదు.

అలాగే.. పాకిస్తాన్ వ్యవస్థీకృత భిక్షాటన ముఠాలు దేశం నుండి బ‌య‌ట‌కువెళ్లడం ప్రారంభించాయి. 2024లో సౌదీ అరేబియా గత మూడేళ్లలో 4,000 మంది యాచకులను బహిష్కరించినట్లు పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) గత ఏడాది పార్లమెంటరీ సంస్థకు తెలియజేసినట్లు డాన్ నివేదించింది.

సౌదీ అరేబియాలో భిక్షాటనకు వ్యతిరేకంగా ఉన్న చట్టం ప్ర‌కారం.. అక్క‌డి ప్రజలు యాచించడం లేదా యాచించే ముఠాలలో చేరితే.. జరిమానాలు, జైలు శిక్ష వంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. భిక్షాటన చేసే విదేశీ వ్యక్తులను శిక్షాకాలం పూర్తయిన తర్వాత దేశం నుండి బహిష్కరిస్తుంది.

Next Story