కూర్చుని మాట్లాడుకుంటేనే స‌మ‌స్యకు ప‌రిష్కారం..!

న్యూ ఇయర్ మరుసటి రోజే వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అరెస్టయ్యారు.

By -  Medi Samrat
Published on : 7 Jan 2026 10:19 AM IST

కూర్చుని మాట్లాడుకుంటేనే స‌మ‌స్యకు ప‌రిష్కారం..!

న్యూ ఇయర్ మరుసటి రోజే వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అరెస్టయ్యారు. దీంతో వెనిజులాలో రాత్రికి రాత్రే అంతా మారిపోయింది. ఈ ఘటనతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా పెదవి విరిచారు.

వెనిజులాలో జరిగిన ఘటనపై భారత్ చాలా ఆందోళన చెందుతోందని భారత విదేశాంగ మంత్రి చెప్పారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్ర‌స్తుతం లక్సెంబర్గ్ పర్యటనలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వెనిజులాపై దాడి తర్వాత జైశంకర్ మొద‌టిసారి స్పందించారు.

విదేశాంగ మంత్రి మాట్లాడుతూ “అవును.. వెనిజులాలో పరిస్థితి గురించి మేము ఆందోళన చెందుతున్నాము. అన్ని పక్షాలు కూర్చుని చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వెనిజులా ప్రజలకు కూడా ఇది చాలా ముఖ్యం. వెనిజులాతో కొన్నాళ్లుగా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి ప్రజలు సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నామన్నారు.

లక్సెంబర్గ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి జేవియర్ బెటెల్‌తో ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ ప్రకటన చేశారు. అయితే అంతకుముందు ఆదివారమే వెనిజులాలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసి శాంతి నెలకొల్పాలని ఇరు ప‌క్షాల‌కు విజ్ఞప్తి చేసింది.

Next Story