మార్చి 7 సోమవారం ఖార్కివ్ నగరంలో జరిగిన యుద్ధంలో మరొక రష్యన్ జనరల్ విటాలి గెరాసిమోవ్ మరణించినట్లు ఉక్రేనియన్ రక్షణ శాఖ తెలిపింది. "ఆక్రమిత సైన్యం యొక్క సీనియర్ కమాండ్ సిబ్బందిలో మరొక నష్టం" అని ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యొక్క 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్. ఉక్రేనియన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. విటాలీ గెరాసిమోవ్ రెండవ చెచెన్ యుద్ధం, సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాలలో పాత్ర పోషించాడు. అతనికి 2014లో 'క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు' పతకం కూడా లభించింది. ది ఇండిపెండెంట్ నివేదించిన ప్రకారం.. ఒక స్నిపర్ రష్యన్ 7వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండింగ్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీని, 41వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన డిప్యూటీ కమాండర్‌ను చంపిన తర్వాత ఇది జరిగింది.
తరలింపుల కోసం పరిమిత కాల్పుల విరమణ
రష్యా సోమవారం మరో పరిమిత కాల్పుల విరమణ, సురక్షిత కారిడార్‌ల ఏర్పాటును ప్రకటించింది. యుక్రేనియన్ నగరాలైన కైవ్, మారియుపోల్, ఖార్కివ్, సుమీ నుండి పౌరులు సోమవారం పారిపోయారు. అయినప్పటికీ, వ్లాదిమిర్ పుతిన్ దళాలు రాకెట్లతో నగరాలను శిధిలాలుగా మార్చడం కొనసాగిస్తున్నాయి. యుద్ధం 12వ రోజుకు చేరుకోవడంతో బెలారస్-పోలాండ్ సరిహద్దులో మూడో రౌండ్ చర్చల కోసం ఇరుపక్షాలు సమావేశమయ్యాయి. రష్యా విధించిన నాలుగు షరతులను అనుసరించాలని క్రెమ్లిన్ ఉక్రెయిన్‌ను కోరింది. షరతుల జాబితాకు అనుగుణంగా ఉంటే సైనిక కార్యకలాపాలను "క్షణం" లో నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా ఉక్రెయిన్‌కు తెలిపింది.