స్పేస్‌లో షూటింగ్‌.. తిరిగొచ్చిన సినిమా బృందం.!

Russian crew returns to earth after filming first movie in space. సినిమా షూటింగ్‌ కోసం స్పేస్‌లోకి వెళ్లి రష్యా చిత్ర బృందం.. తిరిగి భూమి మీదకు చేరుకున్నారు.

By అంజి  Published on  18 Oct 2021 10:13 AM IST
స్పేస్‌లో షూటింగ్‌.. తిరిగొచ్చిన సినిమా బృందం.!

సినిమా షూటింగ్‌ కోసం స్పేస్‌లోకి వెళ్లి రష్యా చిత్ర బృందం.. తిరిగి భూమి మీదకు చేరుకున్నారు. ఆదివారం నాడు సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ అయ్యారు. ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్‌ సెంటర్‌లో షూటింగ్‌ కోసం రష్యాకు చెందిన 'ది చాలెంజ్' చిత్ర బృందం స్పేస్‌కి వెళ్లింది. అక్కడ 12 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అనంతరం వారు కజఖ్‌స్థాన్‌లోని ఓ మైదాన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది. స్పేస్‌లో షూటింగ్‌ చేసిన మొదటి సినిమా ఇదే. రష్యా నటి యులియా పెరెసిల్డ్, దర్శకుడు క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్‌ ష్కా ప్లోరోవ్‌లు షూటింగ్‌ కోసం స్పేస్‌ వెళ్లారు. స్పేస్‌లో సినిమా షూటింగ్‌ కోసం వీరు 4 నెలల పాటు ట్రైనింగ్‌ తీసుకున్నారు.



సినిమాలో... స్పేస్‌లో ఉన్న ఓ వ్యోమగామికి గుండె నొప్పి వస్తుంది. ఈ క్రమంలోనే అతనికి చికిత్స చేసేందుకు డాక్టర్‌ ఏ విధంగా స్పేస్‌కు చేరుకుంటాడనే అనే అంవాలపై సినిమా షూటింగ్‌ జరిగింది. ఈ సినిమాలో ఇద్దరు వ్యోమగాములు గెస్ట్‌ రోల్‌లో యాక్ట్‌ చేశారు. ప్రైవేట్‌ స్పేస్ సంస్థలు ఇటీవల తమ రాకెట్‌ ప్రయోగాలతో అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నాయి. ఈ రికార్డునుల బ్రేక్‌ చేసేందుకు రష్యా స్పేస్‌ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపట్టిందని తెలుస్తోంది. చిత్ర బృందం తిరిగి భూమికి వచ్చే సమయంలో సోయుజ్‌ ఎంఎస్‌-18లో కొంత ఇబ్బంది తలెత్తింది. అయిన అనుకున్న టైమ్‌కి భూమికి చేరిందని రష్యా అంతరిక్ష సంస్థ తెలిపింది.

Next Story