మనుషులకూ బర్డ్ ఫ్లూ.. ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా..? రష్యా పరిశోధకులు ఏమంటున్నారు..?
Russia detects first case of H5N8 bird flu in humans. ఒక వైపు కరోనా మహమ్మారి, మరోవైపు స్ట్రెయిన్ వైరస్.. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్..
By Medi Samrat Published on 22 Feb 2021 6:46 AM GMTఒక వైపు కరోనా మహమ్మారి, మరోవైపు స్ట్రెయిన్ వైరస్.. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్.. ఇలా వైరస్‌లన్నీ మానవాళిపై దాడులు చేస్తుండటంతో మానవుడు జీవించడం అనేది పెద్ద సమస్యగా మారిపోతోంది. ఏడాదికిపైగా కరోనా వైరస్ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఆ వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతుండటంతో జనాలకు కింటినిండ కునుకు లేకుండా చేస్తోంది. పక్షులకు సోకిన బర్డ్‌ఫ్లూ వైరస్ ఇప్పుడు మనుషులకు సోకుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో ఓ పౌల్ట్రీ పామ్‌లో కోళ్లకు ఉన్న బర్డ్ ఫ్లూ (H5N8 రూపాంతర వైరస్) ఓ వ్యక్తికి సోకింది. బర్డ్ ఫ్లూ లక్షణాలు మనుషుల్లో ఉండటంతో పరిశోధకులు మరింత పరిశీలన చేస్తున్నారు.
అయితే కోళ్ల ఫాంలో పని చేసే కార్మికుల్లో ఒకరు ఆరోగ్యం పాలవడంతో పరీక్షలు నిర్వహించగా, బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రష్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సమాచారం అందించారు.అయితే ఆ కోళ్ల ఫాంలో పని చేసే వారు ఆరోగ్యంగానే ఉన్నారని రష్యాకు చెందిన వినియోగదారుల ఆరోగ్య పరిశీలన సంస్థ నిర్వాహకులు పొపొవా తెలిపారు. వైరస్ సోకకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఒకరి నుంచి ఒకరికి బర్డ్ ఫ్లూ సోకుతుందా..?
అయితే పక్షుల నుంచి మనుషులకు సోకుతున్న బర్డ్ ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా..? అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని పొపొవా అన్నారు. తాజా కేసును ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశీలిస్తోందని అన్నారు. అయితే బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి రక్త నమూనాలను(మనుషులకు సోకే రూపాంతర వైరస్) రష్యాలోని వెక్టార్ ల్యాబొరేటరి సేకరించింది. ఇప్పుడు దీనిపై పరిశోధనలు జరుపుతోంది. అయితే ఇప్పటి వరకూ H5N8 బర్డ్ ఫ్లూ వైరస్ పక్షులకే సోకుతుంది. అది మనుషులకు సోకుతుందంటే ఆ వైరస్‌కు కూడా మార్పు వచ్చినట్లేనని, అందుకే ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకునేందుకు జన్యు పదార్థాన్ని సేకరించారు.
అయితే ప్రస్తుతం రూపాంతరం చెందిన బర్డ్ ఫ్లూ.. మనుషుల నుంచి మనుషులకు సోకేలా లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుండగా, మరో మూడు నెలల్లో అది మరింతగా రూపాంతరం చెంది మనుషుల నుంచి మనుషులకే సోకే అవకాశం లేకపోలేదని రష్యా అధికారి పొపొవా అంటున్నారు. ఈ బర్డ్ ఫ్లూ పై కూడా మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని, పక్షుల నుంచి రూపాంతరం చెందిన ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా.? అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రష్యా పరిశోధకులు చెబుతున్నారు.