బంగ్లాదేశ్ లో ఘటనలపై ఆరెస్సెస్ ఆగ్రహం

బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

By Medi Samrat  Published on  30 Nov 2024 10:45 AM GMT
బంగ్లాదేశ్ లో ఘటనలపై ఆరెస్సెస్ ఆగ్రహం

బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణాలపై ప్రపంచ వ్యాప్తంగా మద్దతును కూడగట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఖండించారు. ముమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీలపై పెరుగుతున్న హింసను అడ్డుకోకుండా చోద్యం చూస్తూ ఉందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మహిళలు, ఇతర మైనార్టీలపై జరుగుతోన్న దాడుల మీద ఆ దేశ ప్రభుత్వం మౌనం వహిస్తోందని దత్తాత్రేయ హోసబాలే విమర్శించారు.

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు తరువాత షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయ్యాక హిందూ మైనారిటీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డాయి. ఈ ఉదంతాలను ఖండిస్తూ ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ భారత దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను శ్రీకారం చుట్టాయి.

Next Story