బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు

Riots in Bangladesh. బంగ్లాదేశ్‌ దేశంలో అల్లర్లు కొనసాగుతున్నాయు

By Medi Samrat  Published on  29 March 2021 2:55 AM GMT
Riots in Bangladesh

భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ దేశంలో అల్లర్లు కొనసాగుతున్నాయు. హిఫాజత్‌ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. భారత్‌లో ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ హిఫాజత్‌ ఎ ఇస్లాం ఆరోపించింది. దీంతో ఆందోళనకారులు శుక్రవారం నుంచి పలుచోట్ల దాడులకు దిగారు. ఇప్పటివరకు 12మంది ఆందోళనకారులు మృతి చెందారు. పదిమందికి పైగా గాయపడ్డారు.

ఆందోళన కారులు స్థానిక హిందూ దేవాలయాలపై దాడికి దిగారు. బ్రహ్మన్‌బరియాలో ఓ రైలుకు, రెండు బస్సులకు నిప్పంటించారు. ఈ ఆందోళనలో వందలమంది ఆందోళనకారులు పాల్గొన్నారు. ఘటనలో 10 మంది గాయపడ్డారు. పలు ప్రభుత్వ భవనాలు, ఓ ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పంటించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు అందోళనకారులపై భాష్పవాయువు, రబ్బరు బులెట్లును ప్రయోగించారు. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢాకా వెళ్లారు. ఆయన పర్యటనను కొన్ని ఇస్లామిక్ సంస్థలు వ్యతిరేకించాయి.



Next Story