లంకాధిపతిగా రణిల్ విక్రమసింఘే
Ranil Wickremesinghe elected as the new president of Sri Lanka.శ్రీలంకలో గత కొద్ది నెలలుగా కొనసాగుతోన్న రాజకీయ
By తోట వంశీ కుమార్ Published on 20 July 2022 8:05 AM GMTశ్రీలంకలో గత కొద్ది నెలలుగా కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని, యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘై లంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటింగ్ జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో రణిల్ విజయం సాధించారు. మొత్తం 219 ఓట్లు పోలుకాగా.. రణిల్ విక్రమ సింఘేకు 134 ఓట్లు రాగా అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. దీంతో విక్రమ సింఘే శ్రీలంక 8వ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో శ్రీలంక దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో అధ్యక్ష పదవికి గొటాబయ రాజపక్స రాజీనామా చేశారు. కాగా.. 1978 నుంచి అంటే గత 44 ఏళ్ల లంక చరిత్రలో అధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విక్రమసింఘే మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు. రేపటి నుంచి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానని చెప్పారు.
1973లో రణిల్ మొదటి సారి పార్లమెంట్‌కు ఎన్నికైయ్యారు. 1993లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరు దఫాలుగా ప్రధాన మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో వచ్చిన విభేదాలు విక్రమ సింఘే ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి. ఇక 2020 ఎన్నికల్లో విక్రమ సింఘే పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.