కిమ్ కు మెసేజ్‌ పంపిన క్వీన్ ఎలిజబెత్

Queen Elizabeth II Sends 'good Wishes' To Kim Jong Un On North Korea's National Day. కిమ్ జోంగ్ ఉన్‌.. ఉత్తర కొరియా నియంత..! ఆయన గురించి

By M.S.R  Published on  15 Sept 2021 7:14 PM IST
కిమ్ కు మెసేజ్‌ పంపిన క్వీన్ ఎలిజబెత్

కిమ్ జోంగ్ ఉన్‌.. ఉత్తర కొరియా నియంత..! ఆయన గురించి తెలుసుకోడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన గురించి.. ఆయన దేశం గురించి తెలిసింది అతి తక్కువే..! ఇక కిమ్ తో పెద్దగా ఇతర దేశాల నాయకులకు కూడా సత్సంబంధాలు ఉండవు. అలా ఓ వెరైటీ లైఫ్ స్టైల్ ఆయనది. అయితే కిమ్ కు క్వీన్ ఎలిజబెత్ ఓ మెసీజీ పంపిందట..! ఉత్తర కొరియా జాతీయ దినోత్సవాల సందర్భంగా ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల 7న ఆమె ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ద్వారా ఈ సందేశాన్ని పంపించినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ ధ్రువీకరించింది. ఉత్తర కొరియా మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఉత్తర కొరియా 73వ వ్యవస్థాపక దినోత్సవాలు ఈ నెల 9న అంగరంగ వైభవంగా జరిగాయి. అంతకు రెండు రోజుల ముందే, అంటే సెప్టెంబరు 7న బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ నుంచి శుభాకాంక్షల సందేశం కిమ్ జోంగ్ ఉన్‌కు చేరిందని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. ''ప్రజాస్వామిక ప్రజా గణతంత్ర కొరియా జాతీయ దినోత్సవాలను జరుపుకుంటున్నందువల్ల, నేను భవిష్యత్తు కోసం శుభాకాంక్షలను పంపిస్తున్నాను'' అని బ్రిటిష్ రాణి సందేశం పంపించారు.

73వ మిలిటరీ పరేడ్‌ సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్‌ కనిపించాడు. ఎప్పుడూ సీరియస్ ముఖంతో కనిపించే కిమ్.. నవ్వుతూ కనిపించాడు. సైనిక పరేడ్‌లో ఎప్పుడూ లేని విధంగా కిమ్‌ కనిపించాడు. ఎంతో ఉత్సాహంగా సైనికుల పరేడ్‌ను తిలకించాడు. కిమ్‌ ఒకప్పుడు 140 కిలోల బరువు ఉండేవాడు. ఇప్పుడు 100కు చేరువయ్యాడని తెలుస్తోంది. ఉత్తర కొరియా 73 వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ సైన్యం పరేడ్‌ నిర్వహించింది. హజ్మత్‌ సూట్‌లో సైన్యం రాత్రి పూట పరేడ్‌ చేసింది. నారింజ రంగులో హజ్మత్‌ సూట్‌లో పరేడ్‌ చేస్తున్న ఉత్తర కొరియా సైన్యం ఫొటోలను మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఎలాంటి క్షిపణులనుగానీ, ఇతర సాంకేతిక పరికరాలనుగానీ ప్రదర్శించలేదని మీడియా నివేదించింది.


Next Story