ఆ పని కోసం పుతిన్‌కు ప్రత్యేక బాడీగార్డు.. ఎప్పుడూ అతడు ఉండాల్సిందే
Putin's Bodyguards Collect His Excrement On Trips Abroad To Hide Possible Health Problems.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2022 4:28 PM ISTరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు వింటేనే కొన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఎవ్వరు చెప్పినా వినకుండా చిన్న దేశమైన ఉక్రెయిన్ పై దండయాత్ర చేపట్టారు. యుద్దంలో తమ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా లెక్క చేయక.. ఒక్కొ నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్దం మొదలైన నాటి నుంచి పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై పలు కథనాలు వస్తూనే ఉన్నాయి.పుతిన్ ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఇంకా పలు వ్యాధులతో పోరాడుతున్నారని ఇటీవల వార్తలు రాగా.. వాటిని రష్యా అధికారులు కొట్టిపారేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పుతిన్‌కు సంబంధించిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఓ ప్రత్యేకమైన బాడీగార్డ్ ఎల్లవేళలా పుతిన్‌ను అంటిపెట్టుకుంటాడని, అతడు పుతిన్ విసర్జించే మల మూత్రాలను ఎప్పకప్పుడు సేకరిస్తుంటాడని ఓ అంతర్జాతీయ పత్రిక ఓ కథనాన్ని రాసింది. పుతిన్ ఆరోగ్య రహస్యాలు తెలియకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓ బాడీగార్డ్ పుతిన్ మలమూత్రాలను సేకరిస్తున్నట్లు ఆ కథనంలో రాసుకొచ్చారు.
విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య రహస్యాలు చిక్కవద్దు అని పుతిన్ ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రెబెకా కోఫ్లర్ తెలిపారు. రష్యాకు చెందిన ఫెడరల్ గార్డ్ సర్వీస్ ప్రత్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుందని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మలమూత్రాలను తిరిగి మాస్కోకు పంపిస్తారని తెలిపింది. ప్రత్యేక ప్యాకెట్లలో వ్యర్ధాలను ప్యాక్ చేసి, ఆ ప్యాకెట్లను బ్రీఫ్‌కేస్‌లో పెడుతారని రాసింది. పుతిన్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ ప్రత్యేక ఏర్పాటు కొనసాగుతోందని తెలిపింది.