వ్యాక్సిన్‌ వేసుకోని వారి.. జీవితాలు కఠినతరం చేస్తా.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు

President Macron warns he will 'hassle' France's unvaccinated. ఫ్రాన్స్‌ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క

By అంజి  Published on  5 Jan 2022 11:57 AM IST
వ్యాక్సిన్‌ వేసుకోని వారి.. జీవితాలు కఠినతరం చేస్తా.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని వారిపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్‌ మాక్రాన్‌ విరుచుకుపడ్డారు. ఆ దేశ పౌరులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్న.. ఆ దేశంలో కొందరు కావాలనే వ్యాక్సిన్‌ వేసుకోవడం లేదని తెలుస్తోంది. కోవిడ్-19కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ వేసుకోని వారి జీవితాన్ని కష్టతరం చేయాలని భావిస్తున్నట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు. "నేను నిజంగా వారిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను. చివరి వరకు మేము దీన్ని కొనసాగిస్తాము."అని అన్నారు.

ఓ పత్రికి ఇచ్చిన ఇంటర్య్వూలో అధ్యక్షుడు మాట్లాడుతూ.. తీవ్రమైన రీతిలో పదజాలాన్ని వాడారు. అయితే ఆయన వాడిన బాష అధ్యక్ష పదవికి తగినది కాదని రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు ఏకం కావడం వల్ల కోవిడ్ పాస్‌లపై బిల్లు ఆలస్యం కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాజీవితంలో ఎక్కువ భాగం వ్యాక్సినేషన్ చేయని వారిని నిరోధించే బిల్లుపై పార్లమెంటులో చర్చ అర్ధరాత్రి తర్వాత కొనసాగకుండా నిరోధించబడింది. కోవిడ్‌ పాస్‌ బిల్లును.. వ్యాక్సిన్‌ వేసుకోని వారిని రెస్టారెంట్లు, బార్లు, సినిమాలకు రానియకుండా ఉండేందుకు ప్రవేశపెట్టారు.

ఈ వారం ఓటింగ్‌లో చట్టం ఆమోదించబడుతుందని భావించారు. అయితే ఇది టీకా వ్యతిరేకులకు కోపం తెప్పించింది. అనేక మంది ఫ్రెంచ్ ఎంపీలు ఈ సమస్యపై తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. బలవంతంగా మాత్రం వ్యాక్సిన్లు ఇవ్వమని అధ్యక్షుడు మాక్రాన్‌ తెలిపారు. అయితే ప్రజా జీవితంలోకి రావాలంటే వ్యాక్సిన్లు తప్పనిసరి అని పేర్కొన్నారు. "నేను (వ్యాక్సినేషన్ చేయని వ్యక్తులను) జైలుకు పంపను" అని అధ్యక్షుడు చెప్పాడు. "కాబట్టి మేము వారికి చెప్పాలి.. జనవరి 15 నుండి రెస్టారెంట్‌కి, సినిమాలకు, పబ్‌లకు వెళ్లలేరని" అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాట్లాడారు.

Next Story