కాల్పులతో ద‌ద్ద‌రిల్లిన అగ్ర‌రాజ్యం.. గర్భిణీతో సహా ఆరుగురు మృతి

Pregnant woman among 6 killed in Indianapolis. అగ్ర‌రాజ్యం అమెరికా మరోమారు కాల్పుల‌ కలకలంతో ద‌ద్ద‌రిల్లింది.గర్భిణీతో సహా ఆరుగురు మృతి.

By Medi Samrat  Published on  25 Jan 2021 12:46 PM IST
Pregnant woman among 6 killed in Indianapolis

అగ్ర‌రాజ్యం అమెరికా మరోమారు కాల్పుల‌ కలకలంతో ద‌ద్ద‌రిల్లింది. ఆదివారం తెల్లవారుజామున ఇండియానా పోలిస్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గర్భిణీతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గర్భిణీ స్త్రీ చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కాల్పులను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఇంత పెద్దఎత్తున‌ కాల్పులు చూడలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.


Next Story