భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్‌ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు

By Knakam Karthik
Published on : 9 July 2025 7:40 AM IST

National News, Pm Modi, Brazils Highest Civilian Award

భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్‌ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది సదరన్‌ క్రాస్‌’ పురస్కారాన్ని ప్రధాని మోదీకీ ప్రదానం చేశారు బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా. భారత్- బ్రెజిల్​ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించినందుకే ఇచ్చినట్లు తెలిపారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోదీ 26 దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.

ఇటీవలె పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఘనా వెళ్లిన ప్రధాని మోదీని ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో సత్కరించారు. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ మోదీకి ఈ అవార్డును మోదీకి అందజేశారు. కరీబియన్‌ దేశమైన ట్రినిడాడ్ అండ్‌ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్ ది రిపబ్లిక్‌ ఆఫ్ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో’తో ప్రధాని మోదీని సత్కరించారు. ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్‌ కార్లా కంగాలో చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కాగా, ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేత మోదీయేనని భారత విదేశాంగశాఖ వివరించింది.

Next Story