ఒబామాకి కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష

PM Modi wishes Barack Obama quick recovery from Covid. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌

By అంజి  Published on  14 March 2022 10:08 AM IST
ఒబామాకి కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఒబామానే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందన్నారు. కొన్ని రోజులుగా గొంతు నొప్పిగా ఉందని, అయినా తాను బాగానే ఉన్నానని ఒబామా చెప్పారు. తన సతీమణి మిచెల్‌ ఒబామాకు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ వ్యాక్సిన్లు వేయించుకోకపోతే, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. కాగా కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆకాంక్షించారు.



Next Story