ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్, మా స్టాండ్ ఎప్పటికీ ఒకటే: ప్రధాని మోదీ

ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

By -  Knakam Karthik
Published on : 8 Feb 2026 2:36 PM IST

PM Modi, Malasiya Tour, India, Terrorism

ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్, మా స్టాండ్ ఎప్పటికీ ఒకటే: ప్రధాని మోదీ

కౌలాలంపూర్: ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్ సందేశం చాలా క్లియర్ అయిందని మోదీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదంపై పోరాడుతామని ఆయన తేల్చి చెప్పారు. ఇందుకోసం భారత్, మలేషియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకూ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

రెండు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, ఆదివారం ఉదయం పుత్రజయ నగరం వేదికగా ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం అన్వర్ ఇబ్రహీం, నరేంద్ర మోదీ కలిసి సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మోదీ ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.

నేడు, మలేషియా భారతీయ సంతతికి చెందిన జనాభాతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. మన నాగరికతలు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం మరియు ప్రజాస్వామ్య విలువలు మనల్ని కలిపి ఉంచుతాయి" అని ఆయన అన్నారు. ఉగ్రవాద నిరోధం, నిఘా సమాచారం పంచుకోవడం, సముద్ర భద్రత వంటి అంశాలలో ఇరు పక్షాలు సహకారాన్ని బలోపేతం చేసుకుంటాయని మోదీ అన్నారు. రక్షణ సహకారాన్ని మరింత సమగ్రంగా మారుస్తామని ఆయన అన్నారు. "AI మరియు డిజిటల్ టెక్నాలజీలతో పాటు, మేము సెమీకండక్టర్లు, ఆరోగ్యం మరియు ఆహార భద్రతలో భాగస్వామ్యాలను ముందుకు తీసుకువెళతాము" అని ఆయన అన్నారు.

Next Story