పుతిన్‌ను కలవడానికి ప్రధాని మోదీ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు రెండు రోజుల రష్యా పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2024 5:23 PM ISTపుతిన్‌ను కలవడానికి ప్రధాని మోదీ పయనం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు రెండు రోజుల రష్యా పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు. మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమవ్వనున్నారు మోదీ. పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. మాస్కోలో తన పర్యటనను ముగించుకుని జూలై 9, 10 తేదీల్లో ఆస్ట్రియాకు మోదీ వెళ్లనున్నారు.
ప్రధాని మోదీ తొలిసారిగా ఆస్ట్రియానుసందర్శించనున్నారు. అంతేకాకుండా 1983లో ఇందిరాగాంధీ తర్వాత 41 సంవత్సరాలలో భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. రష్యా, ఆస్ట్రియాలో తన పర్యటనలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోడానికి భారతదేశానికి అవకాశాన్ని అందిస్తాయని అన్నారు. పుతిన్.. ప్రధాని మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. మాస్కోలోని ఎగ్జిబిషన్ వేదిక వద్ద ఉన్న రోసాటమ్ పెవిలియన్‌ను సందర్శిస్తారు. ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ రష్యాకు మొదటిసారి వెళుతున్నారు. 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరైనప్పుడు రష్యాలో మోదీ చివరిసారిగా పర్యటించారు.