45 ఏళ్ల త‌ర్వాత ఆ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త ప్ర‌ధాని

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్‌లోని వార్సా చేరుకున్నారు

By Medi Samrat  Published on  21 Aug 2024 8:30 PM IST
45 ఏళ్ల త‌ర్వాత ఆ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త ప్ర‌ధాని

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్‌లోని వార్సా చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని వార్సాలో ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. గత 45 ఏళ్లలో ఓ భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అంతకుముందు 1979లో మొరార్జీ దేశాయ్ పోలాండ్‌లో ప‌ర్య‌టించారు. వార్సాలో ప్రధాని మోదీ పోలిష్ అధ్యక్షుడు ఆండ్రెజ్ సెబాస్టియన్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్‌లతో భేటీ కానున్నారు. పోలాండ్‌లో ఉన్న భారతీయ ప్రజలను కూడా ప్రధాని మోదీ కలుసుకోనున్నారు.

పోలాండ్‌లో రెండు రోజుల పర్యటన తర్వాత ప్రధాని మోదీ.. ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ నాలుగోసారి భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు చివరిసారిగా జూన్ 14, 2024న ఇటలీలో జరిగిన G7 సమ్మిట్‌లో కలుసుకున్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ర‌ష్యాతో ఉక్రెయిన్‌ యుద్ధం సహా పలు అంశాలు చర్చకు రానున్నాయని భావిస్తున్నారు.

Next Story