ఓమిక్రాన్‌పై సమర్థవంతంగా పని చేస్తోన్న.. ఫైజర్‌ యాంటీ వైరల్‌ టాబ్లెట్‌.!

Pfizer says new trial confirms high efficacy of its COVID antiviral pills. ఓమిక్రాన్‌పై సమర్థవంతంగా పని చేస్తోన్న.. ఫైజర్‌ యాంటీ వైరల్‌ టాబ్లెట్‌.!

By అంజి  Published on  15 Dec 2021 2:18 AM GMT
ఓమిక్రాన్‌పై సమర్థవంతంగా పని చేస్తోన్న.. ఫైజర్‌ యాంటీ వైరల్‌ టాబ్లెట్‌.!

ఓమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రముఖ ఫార్మా సంస్థ తయారు చేసిన యాంటీ వైరల్‌ టాబ్లెట్‌ సమర్థవంతంగా పనిచేస్తోందట. ఈ విషయాన్ని ఫైజర్‌ సంస్థనే చెప్పింది. కొవిడ్‌-19 చికిత్స కోసం యాంటీ వైరల్‌ టాబ్లెట్‌ను ఫైజర్‌ సంస్థ ప్రయోగాత్మకంగా రూపొందించింది. కాగా 2,250 మందిపై నిర్వహించిన అధ్యయనంలో.. ఓమిక్రాన్‌ వేరియంట్‌పై బాగా పని చేస్తోందని ప్రాథమికంగా తెలిసిందని పేర్కొంది. ఓమిక్రాన్‌ వేరియంట్‌ ముప్పు ఉన్న వారు ఈ టాబ్లెట్‌ వేసుకుంటే చాలా రక్షణ కల్పిస్తుందని తేలింది. లక్షణాలు ఉన్న వారు ఈ టాబ్లెట్‌ను వేసుకోవడం ద్వారా ఆస్పత్రి పాలు కాకుండా, మరణాల బారినపడకుండా 89 శాతం తగ్గినట్లు వెల్లడైందని ఫైజర్‌ సంస్థ పేర్కొంది.

యాంటీ వైరల్‌ టాబ్లెట్‌ వేసుకున్నవారిలో వైరస్‌ స్థాయి 10 రెట్లు తగ్గిందని చెప్పారు. ల్యాబ్‌ చేసిన మరో పరీక్షలో కూడా ఇది నిరూపితమూంది. ఓమిక్రాన్‌ వేరియంట్‌పై ఈ టాబ్లెట్‌ సమర్థంగా పని చేస్తున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పారు. వైరస్‌ తన పునరుత్పత్తి కోసం ఉపయోగించే ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు కృత్రిమంగా తయారు చేసి.. దానిపై ఈ టాబ్లెట్‌ను ప్రయోగించారు. అప్పుడు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఫైజర్‌ టాబ్లెట్‌తో పాటు మెర్క్‌ సంస్థ తయారు చేసిన మరో టాబ్లెట్‌ను కరోనా చికిత్స కోసం అనుమతిచ్చే అంశంపై ఎఫ్‌డీఏ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు ఓమిక్రాన్‌ వేరియంట్‌ తలెత్తే ఇన్‌ఫెక్షన్‌.. ఇతర ఇన్‌ఫెక్షన్ల కంటే తక్కువేనని తమ అధ్యయనంలో తేలిందని దక్షిణాఫ్రికా చెబుతోంది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు పొందిన వారికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ నుండి 33 శాతం రక్షణ మాత్రమే లభిస్తోందని తెలిసిందన్నారు.

Next Story