దెయ్యాలు, భూతాలు ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి అకస్మాత్తుగా మృత్యువాత ప‌డ్డాడు..!

54 ఏళ్ల పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రివెరియా (దెయ్యాలు, భూతాలు లాంటివి ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి) అన్నాబెల్లె బొమ్మతో పర్యటిస్తూ అకస్మాత్తుగా మరణించాడని అతని టూర్ నిర్వాహకులు తెలిపారు.

By Medi Samrat
Published on : 16 July 2025 8:30 PM IST

దెయ్యాలు, భూతాలు ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి అకస్మాత్తుగా మృత్యువాత ప‌డ్డాడు..!

54 ఏళ్ల పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రివెరియా (దెయ్యాలు, భూతాలు లాంటివి ఉన్నాయా లేదా అని తేల్చే వ్యక్తి) అన్నాబెల్లె బొమ్మతో పర్యటిస్తూ అకస్మాత్తుగా మరణించాడని అతని టూర్ నిర్వాహకులు తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన జరిగినప్పుడు, US ఆర్మీలో పని చేసిన డాన్ రివెరా, పెన్సిల్వేనియాలో తన సోల్డౌట్ "డెవిల్స్ ఆన్ ది రన్ టూర్"లో ఉన్నాడు. సోల్జర్స్ నేషనల్ అనాథాశ్రమంలో "ఘోస్ట్లీ ఇమేజెస్ ఆఫ్ గెట్టిస్‌బర్గ్ టూర్స్" నిర్వహించాక అతను ఆదివారం మరణించాడని న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ (NESPR) తెలిపింది.

రివెరియా తన పర్యటనను పూర్తి చేసిన తర్వాత ఊహించని విధంగా మరణించాడు. ఈ టూర్ లో భాగంగా ఆ బృందం దేశవ్యాప్తంగా భూతాల బొమ్మ అనే పేరు ఉన్న అన్నాబెల్లెను వివిధ ప్రదేశాలకు తీసుకువచ్చారు. ఆదివారం సాయంత్రం గెట్టిస్‌బర్గ్‌లో వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రివెరియా మరణించాడని తేల్చారు. మరణానికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగానే ఉంది. ఈవినింగ్ సన్ ప్రకారం, కరోనర్ కార్యాలయ సిబ్బంది మరణం అనుమానాస్పదంగా కనిపించలేదని, రివెరియా తన హోటల్ గదిలో ఒంటరిగా కనిపించాడని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story