విషాదం.. 30 ఏళ్లకే ప్రముఖ సింగర్ కన్నుమూత

కోక్ స్టూడియో హిట్స్ లైలీ జాన్, బీబీ సనమ్, పైమోనా, చుప్‌ సాంగ్స్ ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న ప్రముఖ పాకిస్థానీ గాయని హనియా అస్లాం మరణించినట్లు వార్తలు వచ్చాయి

By Medi Samrat  Published on  12 Aug 2024 6:15 PM IST
విషాదం.. 30 ఏళ్లకే ప్రముఖ సింగర్ కన్నుమూత

కోక్ స్టూడియో హిట్స్ లైలీ జాన్, బీబీ సనమ్, పైమోనా, చుప్‌ సాంగ్స్ ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న ప్రముఖ పాకిస్థానీ గాయని హనియా అస్లాం మరణించినట్లు వార్తలు వచ్చాయి. హనియా అస్లాం మరణించిందని ఆమె బంధువు జెబ్ బంగాష్ సోషల్ మీడియాలో ధృవీకరించారు. ఆమె చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని హనియాకు నివాళులర్పించారు జెబ్ బంగాష్. అస్లాం గుండెపోటుతో మరణించిందని.. ఆమె వయసు 30 ఏళ్లు అని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.

గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తానీ సంగీత పరిశ్రమలో ప్రసిద్ధ గాయకులలో అస్లాం ఒకరు. బంగాష్‌తో కలిసి "జెబ్-హనియా" బ్యాండ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత 2007లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె 2014లో ఉన్నత విద్య చదువుకోడానికి కెనడాకు వెళ్లే ముందు అనేక హిట్‌ సాంగ్స్ లో కలిసి పనిచేశారు. అస్లాం, బంగాష్ కోక్ స్టూడియో పాకిస్తాన్ కోసం అనేక కంపోజిషన్‌లపై పనిచేశారు. గాయని మృతి పట్ల అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.

Next Story