రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయిన పాక్ పోలీసులు

Pakistan police officer gets Rs 100 million in bank account.కరాచీ నగరంలో ఒక పోలీసు అధికారి బ్యాంక్ ఖాతాలో రూ.10 కోట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2022 7:01 AM GMT
రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయిన పాక్ పోలీసులు

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఒక పోలీసు అధికారి బ్యాంక్ ఖాతాలో రూ.10 కోట్లు జ‌మ అయ్యాయి. దీంతో అత‌డు రాత్రికి రాత్రే కోటిశ్వ‌రుడిగా మారిపోయాడు. అంత డ‌బ్బు త‌న‌ ఖాతాలోకి జ‌మైంది అని తెలిసి అత‌డు ఆశ్చ‌ర్య‌పోయాడు. అయితే.. ఎవ‌రు పంపారో మాత్రం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు.

"ఇంత డ‌బ్బు నా ఖాతాలో చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నా ఖాతాలో ఎప్పుడు వేల‌ల్లోనే న‌గ‌దు ఉంటుంది." అని పోలీసు అధికారి అమీర్ గోపాంగ్ చెప్పారు. "బ్యాంక్ నన్ను సంప్రదించినప్పుడు, నా ఖాతాకు 100 మిలియన్ రూపాయలు బదిలీ చేయబడిందని నాకు తెలియజేసినప్పుడు మాత్రమే దీని గురించి నాకు తెలిసింద‌ని" అని అత‌డు చెప్పాడు. అత‌డి ఖాతాను అధికారులు స్తంభింప‌జేశారు. విచారణ జ‌రుగుతుండ‌డంతో అతని ఏటీఎం కార్డును కూడా బ్యాంకు బ్లాక్ చేసిందని ఆయన చెప్పారు.

ఇత‌డి లాగానే లర్కానా, సుక్కూర్‌లలో న‌గ‌రాల్లో మ‌రో ముగ్గురు పోలీసు అధికారుల ఖాతాల్లో రూ.5 కోట్లు చొప్పు న జ‌మ అయ్యాయి. లర్కానా పోలీసుల ప్రతినిధిని సంప్రదించినప్పుడు ఈ విషయం పోలీసుల విచారణలో ఉందని చెప్పారు. "ఈ ముగ్గురూ తమ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందనే విషయం గురించి తమకు తెలియదని చెప్పార‌ని" అని అతను తెలిపాడు.

Next Story